ఇస్లాం శాంతియుతమైన మతమా?

జాకిర్ నాయక్ అనే ఒక ఇస్లాం ప్రచారకుడు తన గొప్ప మాటకారితనంతో ఇస్లాం మాత్రమే గోప్ప మతమని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆయన PTV అనే ఛానల్ ద్వారా తన తర్కములను ప్రజల వద్దకు చేరవేయడం మనకు తెలిసిందే. కాకపోతే మాటలతో మభ్యపెట్టే ఆ ప్రచారకుని మాటలలో ఎంత నిజం ఉంది అని తెలుసుకొనే ప్రయత్నం చేసే సమయం, అభిరుచి ఆదరిలోనూ ఉండదు. కనుక ముఖ్యంగా క్రైస్తవ పాఠకులకు జాకిర్ నాయక్ ఇచ్చే ప్రసంగాలలో ఉన్న నిజానిజాలను బయటపెట్టి వారి అవగాహనను పెంచడమే ఈ వ్యాసము యొక్క ఉద్దేశ్యము. అలాగే జాకిర్ నాయక్‍ను ఒక పెద్ద పండితునిలా గౌరవించే ముస్లింలకు కూడా ఈ వ్యాసం ద్వారా అతని అసలు రంగు  తేల్చి చెప్పే ప్రయత్నం చేయబడినది.

http://www.liveleak.com/view?i=a91_౧౧౮౮౫౨౮౩౯౮

పైన ఇవ్వబడిన లింక్‍లో నాయక్ ఇచ్చిన ఒక ప్రసంగ భాగాన్ని చూడవచ్చు. ఇది ప్రశ్నోత్తరాల సమయంలో ఒక శ్రోత అడిగిన ప్రశ్నకు సమాధానముగా జాకిర్ జవాబు చెప్పిన నేపథ్యంలో రికార్డ్ చేయబడినది.

ప్రశ్న : ఇస్లాం శాంతియుతమైన మతమైతే కత్తితో దానిని ఎందుకు వ్యాపింపజేశారు?

దీనికి జవాబుగా జాకిర్ ఇచ్చిన తర్కములు మనం పైనున్న వీడియోలో చూడవచ్చు. జాకిర్ ఇచ్చిన ఆ జవాబుల సారాంశం ఇలా ఉంది:
"అందరూ శాంతిని మాత్రమే కోరుకోరు, కొంతమంది అసాంఘిక శక్తులు ఉంటారు. కనుక వారిని అదుపులో పెట్టడానికి ఇస్లాంలో కూడా కొద్దిపాటి హింసను ఉపయోగించి ఉండవచ్చు. డిలేస్సి ఒలేరి అనే చరిత్ర కారుడు ఇస్లాం కత్తి ద్వారా వ్యాపించింది అనటం సరికాదు అని తన పుస్తకం అయిన ఇస్లాం ఎట్ ది క్రాస్ రోడ్స్‌లో వివరించాడు. ముస్లిములు 800 సంవత్సరాలు స్పెయిన్ను ఏలారు, కొన్ని వందల ఏళ్ళు భారత దేశాన్ని ఏలారు, అలాగే అరబ్బుల ప్రాంతాలను 14 వందల ఎళ్ళుగా ఏలుతున్నారు, కానీ ఆ దేశాలలో ఇస్లాం ఆధిపత్యంలో ఉన్నప్పుడు  గొంతు మీద కత్తి పెట్టి అందరిని ఇస్లాం మతంలోకి మార్చలేదే? ఖురాన్లోని సూరా 16:125లో చెప్పబడిన ప్రకారం ఇస్లాం మతంలో మతపరంగా ఎవరికీ బలవంతం లేదు. ఇస్లాం వాడిన కత్తి - తర్కము, విచారించడం వంటి శాంతి యుతమైన పద్ధతులే."

జాగ్రత్తగా గమనించి చూస్తే జాకిర్ చాలా సులువుగా ఇస్లాంలోని సిద్ధాంతాన్ని తప్పుగా తెలియ చెప్పినట్టు చూడవచ్చు.

1. ఇస్లాం ఉపయోగించిన హింస కొద్దిపాటి హింస కాదు. 

ఇస్లాం సాహిత్యమైన హదీతు మరియు ఖురాన్ గ్రంథాలే సాక్ష్యంగా ఈ మాటలను ఋజువు చేయవచ్చు.  
సూరా 2:190-191,193,215
సూరా 4:74,89,95
సూరా 8:60,65
సూరా 9:5,14,29,52

ఈ సూరాలు జాకిర్ చెప్పిన కొద్దిపాటి హింసకు సంబంధించినవో కావో పాఠకులే నిర్ణయించాలి. దానికి తోడు ఈ సూరాలు అసమాజిక శక్తులను అణిచి వేయటానికి కాదు కానీ ఇస్లాం మతములో లేని ముస్లిమేతరులను ఇస్లాంలోకి లొంగదీసుకొనే ప్రయత్నం చేసేందుకు ముహమ్మద్ లేక అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞలు. జాకిర్ వీటిని స్వీకరించి ఇస్లాం ఒక హింసాత్మకమైన మతంగా ఒప్పుకోవాలి లేకపోతే ఇస్లాం శాంతియుతమైన మతమేనని చెప్తూ ఈ సూరాలను ఖురాన్లో నుండి చెరిపివేయాలి. యే త్రోవ ఎంచుకుంటాడో ఆయన ఇష్టం. పై సూరాలు మాత్రమే కాదు ఖురాన్ 8:39; 9:5, 36,41 ల ప్రకారము ముస్లిమేతరులను ఇస్లాంలోనికి ఆహ్వానించాలి, వారు ఆహ్వానాన్ని మన్నించి ఇస్లాంలోనికి రాకపోతే వారితో పోరాడి ఇస్లాంకు, దాని ధర్మశాస్త్రమునకు కట్టుబడి ఉండేలా చెయ్యాలని అల్లాహ్‍యే ముహమ్మద్ ద్వారా ముస్లిములకు ఆజ్ఞాపించినట్టు చూడవచ్చు. అలాగే ఇబ్న్ ఇస్హాక్ వ్రాసిన  సీరత్ రాసూలల్లాహ్ అనే అధికారిక ఇస్లాం సాహిత్య పుస్తకంలో ముహమ్మద్ తనపై కవిత్వం వ్రాసిన పుణ్యానికి ఒక వృద్ధుడిని పొట్టన పెట్టుకున్న సంగతి స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఇదే సీరత్ రాసూలల్లాహ్ లో ‘మారవ’ అనే ఒక స్త్రీ ముహమ్మద్‍ను దుర్భాషలాడిందన్న నెపంతో ఆమె భర్తే ఆమెను చంపగా ముహమ్మద్ ఆయనను క్షమించేసిన విషయం చదువవచ్చు.
ఇలా ప్రజలను భయభ్రాంతులను చేసి ఇస్లాంలోనికి రమ్మని ఆహ్వానించడం కత్తి ద్వారా వ్యాపింపచేయడం కాదా?

2. ఏదో ఒక చరిత్రకారుని పేరు చెప్పి చరిత్ర మొత్తంలో ముహమ్మద్‍ను మరియు అతని మతాన్ని శాంతికరమైనది అని నిరూపించే ప్రయత్నం చేయడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే, ఇస్లాం కత్తి ద్వారానే పాకింది అని చెబుతున్న ముస్లిమేతరులు కోకొల్లలుగా ఉన్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి మనం కేవలం ముస్లిం చరిత్రకారులనే తట్టి చూద్దాం వారేమంటారో యిట్టె తెలిసిపోతుంది.

“జూరిస్ ప్రుడెన్స్  ఆఫ్ ముహమ్మద్స్  బయోగ్రఫీ” అనే పుస్తకాన్ని రచించిన డా.బుతీ అను ఒక ప్రసిద్ధ ఇస్లామిక్ చరిత్రకారుడు ఈ విధంగా అన్నాడు."ఇస్లాంలో చెప్పబడిన పవిత్ర యుద్ధము నిజానికి ఒక ఆక్రామక యుద్ధమే. సైనిక బలగాలు అందుబాటులో ఉండే ప్రతి ముస్లిం రాజ్యానికి ఇది ధర్మము. ఇలాంటి ఆక్రామక యుద్ధము ఇస్లాంలోని పవిత్ర యుద్ధముల యొక్క ఆఖరు దశ. అందుకే అల్లాహ్ సేవకుడైన ముహమ్మద్ - "ప్రజలందరూ అల్లాహ్‍యే దేవుడు అని నమ్మేంతవరకు నేను వారితో పోరాడటానికి ఆజ్ఞాపించబడ్డాను అని అనెను." డా: అఫీఫీ అబ్దుల్ ఫత్తా అనే ప్రసిద్ధ ముస్లిం పండితుడు రచించిన ప్రసిద్ధ పుస్తకమైన "ద స్పిరిట్ ఆఫ్ ఇస్లామిక్ రెలిజియన్" లో పేజీ నెంబర్ 382 లో ఇలా ఉంది - “ఇస్లాం యుద్ధము ద్వారా వ్యాపించడం వాస్తవమే మరియు దానికి అది తగును ఎందుకనగా దేవుని వాక్యమును అన్నింటికన్నా గొప్పగా చాటి చెప్పడానికి యుద్ధం చేయడంలో తప్పులేదు. దీని కారణంగానే ముహమ్మద్ తన జీవితకాలంలో అరేబియాకు చుట్టు పక్కల ఉండిన 8 రాజ్యముల రాజులకు ఇస్లాంను స్వీకరించమని ఆహ్వానం పంపెను, కాదని వారు తిరస్కరించగా ముస్లిములు వారితో పోరాడి ఆ రాజ్యాలను ముస్లిం రాజ్యాలుగా చేసిరి,”

ఇబ్న్ కతీర్, అల్ తబరి, బయ్దావీ, ముహమ్మద్ అల్ సైద్ అల్ బుతి, ఇబ్న్ హిష్షాం, ఇలా ఎంచుకుంటూపోతే కోకొల్లలుగా ఇస్లాం చరిత్రకారులు మరియు పండితులు ముహమ్మద్ మతవ్యాప్తి కొరకు మరియు ముస్లిమేతరులను ముస్లిములుగా చేయుటకొరకు చేసిన యుద్ధములను నమోదు చేశారు. మరి ఇవన్నీ జాకిర్ నాయక్‍కు తెలిసినాగాని, వీటిని దాచిపెట్టే ప్రయత్నం చేశాడా లేక ఇవి తెలియక అజ్ఞానంగా మాట్లాడాడా అన్నది ఆయనే చెప్పాలి. కనుక ఎవరో కొందరు చరిత్రకారుల మాటలను అడ్డం పెట్టుకొని తన మాట గెలిపించుకోవాలని చూస్తే, అదే చరిత్ర ఇస్లాంపై బురద చల్లుతుందన్న విషయం మరిచిపోకూడదు.

3 . ముస్లిములు ఏలిన అన్ని దేశాలలో ముస్లిమేతరులు ఉన్నారు, వారే ఇస్లాం యొక్క శాంతి ప్రియత్వానికి నిదర్శనం!!!!

జాకిర్ ఇంత గొప్పగా అబద్ధం ఆడేస్తే విని దానిని పట్టించుకోకుండా ఉండటానికి వినేవారందరూ అమాయకులు కాదు.

  • భారత దేశంలో జరిగిన అరాచకాలు ఇంకా భారతీయులకు గుర్తున్నాయి.
  • హిందువులను ఊచకోత కోసిన మొఘల్ చక్రవర్తుల గురించి ఇంకా చరిత్రలో మనం చదువుతూనే ఉన్నాం.
  • సిక్కు మతం స్థాపించబడటానికి  మూలకారణం అప్పటి హిందువులను బలవంతంగా ఇస్లాంలోనికి మార్చడం కాదా?
  • ఈనాటి పాకిస్తాన్‍లో ముస్లిం మతాన్ని విమర్శించిన కారణంగా సల్మాన్ రష్దిని బహిష్కరించలేదా? చంపే ప్రయత్నం చేయలేదా?
  • ఆఫ్ఘనిస్తాన్‍లో క్రైస్తవులను, బౌద్ధులను ఊచకోత కోయలేదా?
  • టర్కీ దేశములో 1860 నుండి ఇప్పటి వరకు ఎన్ని కోట్ల అర్మేనియన్ క్రైస్తవులను బలిగొన్నారో లోకానికి తెలియదనుకున్నారా?
  • ఉత్తర ఆఫ్రికా దేశాలైన సోమాలియా, సూడాన్ వంటి దేశాలలో క్రైస్తవులపై రోజూ జరిగే అత్యాచారాలు అందరికీ తెలిసినవి కావా?
  • ఈజిప్టులో ఉన్న కాప్టిక్ క్రైస్తవులను ముస్లిములు అదే పనిగా హింసించటం లేదా?
  • ఇవన్నీకాక ఇస్లాం మత ప్రకారముగా, ముస్లిమేతరులు వారి మతమును ఇస్లామీయ దేశాలలో అనుసరించాలంటే  ఆ దేశ చక్రవర్తులకు జిజియ పన్ను కట్టే ఆనవాయితీ ఇస్లాం సాహిత్యాలైన హదీతులు మరియు ఖురాన్‍లో బోధింపబడినదే కదా!

ఇవన్నీ కళ్ళ ముందు రోజూ వార్తలలో చూసే నిజాలే కావా? మరి వీటిని కాదని కేవలం జాకిర్ నాయక్ చెప్పాడని ఇస్లాం మతాన్ని శాంతికరమైన మతంగా చూడడం సాధ్యమేనా?

4 . అమెరికాలో, ఐరోపాలో, ఇంగ్లాండ్‍లో ఎంతో మంది ఇస్లాంను స్వీకరిస్తున్నారు వీరంతా కత్తితోనే మార్చబడ్డారా అని చలాకీగా జాకిర్ అడగటం చూడవచ్చు.

కాకపోతే జాకిర్ చెప్పిన అన్ని ప్రాంతాలలో ప్రస్తుతం ముస్లిములు అధిక శాతంలో లేరు. వారు ఇప్పుడు ఆధిపత్యంలో లేరు కనుక మాటలతో మచ్చికతో మతం పై పెద్దగా అవగాహన లేనివారిని మభ్యపెట్టి మతమార్పిడులు చేస్తూ ఉంటారు. అయినా ఈ దేశాలన్నీ కూడా అలా చేయవద్దని ఆజ్ఞాపించవు; ఎందుకంటే సర్వమత సామరస్యం ఆ దేశాలలోని వారికి ప్రథమం కాబట్టి. కనుకనే ఆ దేశప్రజలు ధైర్యంగా ఇస్లాంను స్వీకరించి దానిని బహిర్గతంగా ఒప్పుకునే స్థితిలో ఉన్నారు. అదే ఇస్లాం దేశాలలో ఒక ముస్లిం క్రైస్తవునిగానో, లేక ఇంకో మతంలోనికో మారితే ధైర్యంగా చెప్పుకోగాలడా? చెప్పుకొని బ్రతకగలడా? జాకిర్ చెప్పిన ఈ ప్రాంతాలలో ముస్లిములు అధిక శాతంలోకి వచ్చిన రోజున వారి ప్రవర్తనలోని  మార్పును లోకం తప్పక చూస్తుంది. అప్పుడు మాటలు కాదుగాని, ముస్లిములు అధిక సంఖ్యలో ఉన్న మిగతా దేశాలలోవలె కత్తులు కటార్లే ప్రజలను ఇస్లాంలోనికి మారుస్తాయి.

క్రైస్తవ దృక్పథంతో ముస్లిములకు సమాధానము చెప్పే వారిలో ఒకరైన శాం షమూన్ అనే నా స్నేహితుని ప్రకారం ఇస్లాంలో మూడు దశలు ఉన్నవి.
1 . ముస్లిమేతరులు ఎక్కువగా ఉన్న సమయంలో శాంతితో ఇస్లాం యొక్క ప్రచారం చేయటం ( సూరా 43 : 88 -89 )
2 . ముస్లిముల సంఖ్య సుమారుగా ఉన్నపుడు సమర్ధించుకొనే దశలో పోరాడటం ( సూరా 2 : 190 -194 , 22 : 39 -41 )
3 . ముస్లిములు ముస్లిమేతరులకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నపుడు వారిని అణిచి, ఇస్లాంను వ్యాపింపచేయటం, వారిని చంపయినా సరే వారిపై ఆధిపత్యం చలాయించటం. ( సూరా 9 : 1 -6 , 9 : 28 -31 )

జాకిర్‍కు ఒక మాట: నువ్వు చెప్పే కల్లబొల్లి కథలు విని మోసపోవటానికి వినేవారందరూ బసవన్నల్లా తలలూపేవారే ఉండరు. ఇప్పటి ప్రజానీకం అన్ని రకాలుగా వివరాలను సేకరించి ఆచి తూచి అడుగువేసే సమాజంలో ఉంది. కనుక దయచేసి నీ మాటలలో కనికట్టుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయవద్దు. నిజంగా ఇస్లాం గురించి ప్రచారం చేయదలచుకుంటే ఇస్లాం చెప్పే సంపూర్ణ బోధను చెప్పు, ఇలా తుంచి వంచి, సగం మాత్రమే ప్రజలకు చూపించి మోసపుచ్చకుంటేనే మంచిది.


ప్రభుతేజ (తెలుగు రచయిత)
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు